సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. ట్రబుల్ షూటర్, మంత్రి టి.హరీశ్‌రావు దీన్ని ఒక సవాల్‌గా తీసుకుని పనిచేశారు. అయినా ఫలితం తారుమారు కావడంతో వారు కొంత నైరాశ్యానికి గురైనట్లు తెలిసింది. అందులోనూ 23వేల పైచిలుకు మెజారిటీతో ఈటల రాజేందర్ గెలవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీకి […]
సామాజిక సారథి, పెద్దశంకరంపేట: రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ షెట్కార్ అన్నారు. మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కల, పెద్దశంకరంపేట ఎస్సీకాలనీల్లో దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో భాగంగా సభ ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ కేవలం ఎన్నికల కోసమే హుజరాబాద్ లో దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని విమర్శించారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా వర్తింప చేయాలని ఆయన అన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న సీఎం కేసీఆర్ ఊరికొక ఉద్యోగం […]
పలువురికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి భరోసా సామాజిక సారథి, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఇటీవల మరణించిన పిట్ల సత్యం ఇంటికి రూ.1.5 లక్షల వ్యయంతో నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మరమ్మతు చేయించారు. ఎమ్మెల్సీ సందర్శించి అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. సత్యం పిల్లల ఉన్నత చదువుల పూర్తి బాధ్యతను తాను తీసుకుంటున్నానని ప్రకటించారు. వారికి […]
సారథి, పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 122 మంది లబ్ధిదారులకు రూ.1.22 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకొండలోని తన నివాసంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.1,00,116 అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని కొనియాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన మహానుభావుడని […]
సారథి, నర్సాపూర్: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన సీఎం కేసీఆర్ కే దక్కిందని, ఆయన మాటలు ఎవరూ నమ్మరని మెదక్‌జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు సింగయపల్లి గోపి, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం బీజేవైఎం నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ […]
సారథి, చొప్పదండి: టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ.. వారిని వంచనకు గురిచేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం విమర్శించారు. మంగళవారం చొప్పదండి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో దళితబంధు అంటూ మరో కొత్త నాటకానికి తెరదీశారని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని, లేకపోతే దళితులంతా […]
సారథి, చొప్పదండి: సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిరుద్యోగ భృతి ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జి.సంపత్, కల్లేపల్లి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో చొప్పదండి మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయకపోతే […]
సారథి, బిజినేపల్లి: నిరంతరం పేదవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాస్ అన్నారు. సీఎం కేసీఆర్ప్రకటించిన దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం బిజినేపల్లి మండల కేంద్రంలో గ్రామశాఖ మహాసభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పాలకవర్గాలు ప్రజాసంక్షేమాన్ని మర్చిపోయి, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో సామాన్యుల జీవన ప్రమాణాలు తగ్గితే పెట్టుబడిదారుల ఆస్తులు పెరిగాయని అన్నారు. పాలకవర్గాలకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే […]