సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆరే కారణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. సకాలంలో టెస్టులు చేసి కరోనా బాధితులను క్వారంటైన్ చేసి ఉంటే కరోనా అదుపులోకి వచ్చిఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ కరోనా ఉధృతిని తక్కువచేసి చూపేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం ఆయన ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పేదకుటుంబానికి రూ.7500 […]