Breaking News

సీఎంవో

యాసంగిలో వరి వేయొద్దు

యాసంగిలో వరి వేయొద్దు

రాష్ట్రానికి స్పష్టం చేసిన కేంద్రం వడ్ల కొనుగోళ్లపై స్పష్టత కరువు నిరాశ కలిగించిందన్న మంత్రి నిరంజన్​రెడ్డి న్యూఢిల్లీ: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. ఈ విషయంపై శుక్రవారం గోయల్‌తో మంత్రుల బృందం గంటపాటు సమాలోచనలు జరిపింది. రెండు సీజనల్లో ధాన్యం సేకరించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. అయితే, గోయల్‌ నుంచి ఇప్పుడు కూడా స్పష్టమైన ప్రకటన రాలేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి […]

Read More
ప్రజలకు శాస్త్రీయమైన వ్యాక్సిన్

ప్రజలకు శాస్త్రీయమైన వ్యాక్సిన్

హైదరాబాద్: శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ […]

Read More
ఆ మాజీ అధికారి వ్యాఖ్యలతో తలనొప్పులు

ఆ మాజీ అధికారి వ్యాఖ్యలతో తలనొప్పులు

ఓ వైపు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం. మరోవైపు పార్టీ గుర్తింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ నోటీసులు, ఇంకోపక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్యలు. వీటితోనే జగన్‌ సర్కారు సతమతమవుతుంటే.. ఇప్పుడు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, సీఎంవో మాజీ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీవీ రమేష్‌ వ్యాఖ్యలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. శుక్రవారం ఆయన ట్వీట్‌ చేసిన అంశాలు ఏపీలోని రాజకీయ, అధికారవర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. […]

Read More
సీఎంవో కోఆర్డినేటర్​కు సన్మానం

సీఎంవో కోఆర్డినేటర్​కు సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ గా నియమితులైన వైఎస్సార్​సీపీ ఆఫీసు ఇన్​చార్జ్​శ్రీకాంత్ రెడ్డిని కర్నూలు పార్లమెంటరీ అధ్యక్షుడు బీవై రామయ్య శుక్రవారం సన్మానించారు. కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డిపొగు, జిల్లా ప్రధాన కార్యదర్శి కటికె గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Read More