సారథి, వెంకటాపూర్: ఆదివాసీ గిరిజన తండావాసులకు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్, ఫౌండేషన్ అండగా నిలిచింది. ఇండ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన గొత్తికోయలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. విద్య, వైద్యంతో పాటు కనీస సౌకర్యాలు పొందాలంటే గ్రామాలకు దగ్గరగా నివాసాలను ఏర్పాటు చేయాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. రెండు రోజుల క్రితం బూర్గుపేట పరిధిలోని సకారిరేవులు గొత్తికోయగూడెం వాసుల ఇండ్లు కాలిపోయాయి. తినడానికి తిండిలేక దిక్కుతోచని స్థితిలో బాధితులు ములుగు, […]
సారథి, ములుగు: కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. శుక్రవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెలుపల శానిటైజర్ హ్యాండ్ వాష్ ను ఏర్పాటుచేశారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలకు కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించారు. కార్యాలయానికి వచ్చే ప్రతిఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలని చూచించారు. ఆఫీసులో మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, ఆఫీసు […]
సారథి న్యూస్, ములుగు: తరచూ సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కు అరుదైన గుర్తింపు దక్కింది. హైదరాబాద్కు చెందిన ఇంద్రోజిర రమేష్ అనే యువకుడు మంగళవారం ఆమె ఫొటోలతో కూడిన జ్ఞాపికను అందజేశాడు. తస్లీమా రైతు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు సెలవు రోజుల్లోనూ వ్యవసాయ పనులు చేస్తూ.. నిరుపేదలకు చేయూతనందిస్తూ.. అనాథలు, అభాగ్యుల ఆకలి తీరుస్తుంటారు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న […]