సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చేయుతనిచ్చేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పెళ్లీడుకొచ్చిన పిల్లలకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆ కుటుంబానికి రూ.1లక్ష అందించడమే కాకుండా ఆ కుటుంబానికి అండగుంటున్న ప్రజానాయకుడు కేసీఆర్ అన్నారు. […]
సారథి న్యూస్, హుస్నాబాద్: 5వేల ఎకరాలకు ఒక్క రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. శనివారం కోహెడ మండలం శనిగరం గ్రామంలో రూ.22లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు వేదిక భవనానికి భూమిపూజ చేశారు. రైతులను రాజులు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అనంతరం ఉపాధిహామీ పథకంలో భాగంగా శనిగరం ప్రాజెక్టు కింద ఉన్న బెజ్జంకి కాల్వ మరమ్మతు పనులను ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండగ రంజాన్ అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుమార్ అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేకమైన నిధులను కేటాయించి వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, డైరెక్టర్ ఆఫ్ లేబర్ కోపరేటివ్ ఆఫ్ ఇండియా […]