సారథి న్యూస్, కర్నూలు: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఇప్పటికే పదిగేట్లను ఎత్తివేసి నాగార్జునసాగర్జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు భద్రత, నీటి మట్టం, విద్యుదుత్పత్తి.. తదితర వాటిని పరిశీలించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 21న శుక్రవారం శ్రీశైలం రానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో శ్రీశైలంలోని సున్నిపెంట హెలిప్యాడ్ లో దిగుతారు. అక్కడి నుంచి జెన్కో […]
సారథి న్యూస్, కర్నూలు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలను తాకుతూ ఉరకలేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో గురువారం సాయంత్రం రిజర్వాయర్10 గేట్లను ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883 అడుగుల మేర ఉంది. అలాగే రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, […]
సారథి న్యూస్, కర్నూలు: జూరాల, సుంకేసుల జలాశయాలను నుంచి నీటి ఉధృతి కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు గురువారం మధ్యాహ్నం ఏడుగేట్లను ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు.
సారథి న్యూస్, కర్నూలు: భారీవరద రావడంతో శ్రీశైలం రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. అధికారులు గురువారం ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 885 అడుగులకు గాను 880 అడుగుల మేర నీటినిల్వ ఉంది. రిజర్వాయర్ సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా, 196 టీఎంసీల నీటినిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.
సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి భారీవరద రావడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం సాయంత్రం 195.7599 టీఎంసీల నీటి సామర్థ్యం చేరుకోవడంతో దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం 215. 807 టీఎంసీలు. 885 అడుగులకు గాను 881 అడుగుల మేర నీటినిల్వ ఉంది. జూరాల రిజర్వాయర్, సుంకేసుల బ్యారేజీ నుంచి మొత్తం శ్రీశైలానికి 3.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. సాయంత్రం ఆరు గంటలకు శిల్పాచక్రపాణి రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు మూడుగేట్లను ఎత్తి […]
శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు బుధవారం ఉదయం సాక్షి గణపతిస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో పూజలు చేశారు. తర్వాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విద్యార్థుల్లో ఆలోచనా […]
సారథి న్యూస్, అచ్చంపేట: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ఘాట్‌రోడ్డులో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలోని దర్గా వద్ద రక్షణగోడ శనివారం కూలింది. సమాచారం అందుకున్న అమ్రాబాద్ పోలీసులు శ్రీశైలం మార్గంలో వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. నాలుగైదు రోజులుగా నల్లమల అటవీప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటికి రక్షణ గోడ కోతకు గురైందని భావిస్తున్నారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో కరోనా కలకలం సృష్టించగా, భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శుక్రవారం నుంచి దర్శనాలను ప్రారంభించినట్టు దేవస్థాన ఈవో కేఎస్ రామారావు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆలయానికి రావొద్దని సూచించారు. క్యూలైన్లలో సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. శుక్రవారం స్థానికులకు దర్శనాలకు అవకాశం కల్పించామని.. శనివారం నుంచి దూరప్రాంతాల వారు రావొచ్చని సూచించారు. ఆలయసిబ్బందికి కరోనా రావడంతో కొంతకాలం క్రితం దర్శనాలను నిలిపివేశారు.