సారథి న్యూస్, హుస్నాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప దార్శనికుడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. ఆదివారం జరగబోయే పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో వొడితెల కుటంబానికున్న సంబంధాన్ని శుక్రవారం గుర్తుచేసుకున్నారు. పీవీ సాహితీవేత్తగా ఓ వైపు మరో వైపు పరిపాలనా దక్షుడిగా ఉంటూ మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపించి అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు, సాంకేతిక రంగాల అభివృద్ధి చెందితే యువతకు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానిపాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) జన్మించి జూన్ 28వ తేదీ నాటికి వందేళ్లు పూర్తి కావడంతో కుటుంబసభ్యులు శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామంలో 1921 జూన్28న ఆయన జన్మించారు. ఆయన తప్పటడుగుల వేసిన నుంచి యవ్వనం వరకు ఉన్న తన ఇంటినే మ్యూజియంగా చేయాలని పీవీ తనయుడు ప్రభాకర్ రావు సంకల్పించారు. తాను 1952లో నిర్మించిన ఇంట్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని పీవీ మెమోరియల్ జ్ఞానభూమిలో ఏర్పాట్లపై అధికారులను అడిగి ఆరాతీశారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సుమారు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణకు తక్షణమే రూ.10కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఉత్సవాల కమిటీ చైర్మన్, రాజ్యసభ […]