బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని యశ్వంత్‌పూర్ ఏరియాలోని ఓ గెస్ట్‌హౌస్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు.. ఆ గెస్ట్‌హౌస్‌పై రైడ్ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి చెరలో ఉన్న ఐదుగురు యువతులను రక్షించి రెస్క్యూ హోంకు తరలించారు. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ రైడింగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. […]
సారథిన్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీసులు తనిఖీ చేసి వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలోని ఓ ఇంజిరింగ్ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీచేసి ముగ్గురు మహిళలతోపాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.