Breaking News

విద్యార్థులు

పట్టుదలతో చదివితేనే భవిష్యతు

సారథి న్యూస్, బెజ్జంకి: విద్యార్థులు తల్లిదండ్రులు కలలను సాకారం చేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ పేర్కొన్నారు. బుధవారం బెజ్జంకి ఆదర్శ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇంటర్​ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రవళిక(973, బైపీసీ), స్వీటీ (971 ఎంపీసీ)లను అభినందించారు. అనంతరం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని చెప్పారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్లు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇంటర్​ ఫలితాలు తెలుసుకోండి ఇలా

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి. మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. అయితే ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఫలితాలు విడుదల చేయాలనుకున్నారు. అందుకే ఫలితాల విడుదలకు ఆలస్యమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. బుధవారం సాయంత్రం ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమై ఇంటర్ ఫలితాల గురించి చర్చించనున్నారు. తెలంగాణ […]

Read More