సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న వరినారు మళ్లలో మొగి పరుగు సోకిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గురువారం వారు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరినారును పరిశీలించారు. మొగి పురుగు నివారణకు కార్బోఫ్యూరన్ లేదా కార్టప్హైడ్రోక్లోరైడ్ గుళికలను నారుమళ్లలో చల్లుకోవాలని నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్ తెలిపారు. నారుమళ్లలో సూక్ష్మధాతు లోపాలు గమనిస్తే ఫార్ములా 4ను పిచికారి చేసుకోవాలని సూచించారు.
సారథి న్యూస్, మెదక్: తొలకరి వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకతో మృగశిర కార్తె ఆరంభం నుంచే వానలు కురుస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆశలు చిగురించాయి. సకాలంలో చినుకు పలకరించి నేలతల్లి మెత్తబడడంతో రైతులు వానాకాలం పంట సాగుకు ఉపక్రమించారు. దుక్కులు దున్నుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరి సాగు చేసే రైతులు నారుమళ్లు పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సొసైటీలు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద సందడి నెలకొంది. […]