సామాజిక సారథి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్న విషయం తెలిసిందే. నీవంటే నీవే అంటూ వేలెత్తిచూపుకుంటున్నాయి. యాసంగి సంగతి అటుంచింతే వానాకాలంలో చేతికొచ్చిన ధాన్యం కొనే దిక్కులేదు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వడ్లు మొలకెత్తడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ఆదుకునే దిక్కు ఎవరని గగ్గోలుపెడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కేంద్రం వద్దంటే యాసంగిలో ధాన్యం కొనలేమని […]