Breaking News

లాక్ డౌన్

లాక్ డౌన్ పై డీఐజీ సమీక్ష

లాక్ డౌన్ పై డీఐజీ సమీక్ష

సారథి, ఖమ్మం: కరోనా ఉధృతి నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతున్న లాక్ డౌన్ అమలుతీరుపై ఆయా జిల్లాల ఎస్పీలతో వరంగల్, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆఫీసులో సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దు అంతర్గత రహదారుల చెక్ పోస్టుల్లో అమలవుతున్న లాక్ డౌన్ తీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ […]

Read More
వాహనాల తనిఖీ

వాహనాల తనిఖీ

సారథి, చొప్పదండి: లాక్ డౌన్ లో భాగంగా మంగళవారం చొప్పదండి సీఐ కె.నాగేశ్వర్ రావు, ఎస్సై బి.వంశీకృష్ణ వాహనాలను తనిఖీచేశారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని మూడు వెహికిల్స్ ను సీజ్ చేశారు. 15 వాహనాలను ఫైన్ వేశారు. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటికి రావొద్దని సూచించారు. ఎలాంటి పనులు ఉన్నప్పటికీ ఉదయం 10 గంటలలోపే పూర్తిచేసుకోవాలని కోరారు.

Read More
వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్యే

వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్యే

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రంలో మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరోనా రెండో డోసు వాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. భౌతికదూరం పాటించాలన్నారు. రెండు మాస్కులు ధరించాలన్నారు. వాక్సినేషన్ తొందరగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిందని ఎమ్మెల్యే తెలిపారు.

Read More
నిబంధనలు పాటించని షాప్ సీజ్

నిబంధనలు పాటించని షాప్ సీజ్

సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వం నిర్ధేశించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వస్త్రదుకాణాన్ని మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ సోమవారం సీజ్ చేసినట్లు ప్రకటించారు. పెద్దశంకరంపేటలో ఉదయం 10 గంటల తర్వాత దుకాణం తెరిచి ఉండటంతో ఎండీ ఆబిద్ హుస్సేన్ క్లాత్ మర్చంట్ దుకాణాన్ని సీజ్ చేశారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు అత్యవసర పని ఉంటేనే బయటికిరావాలని సూచించారు. నాందేడ్ అకోలా -హైదరాబాద్ 161వ జాతీయ రహదారిపై తనిఖీలు చేశారు. […]

Read More
లాక్ డౌన్ గీత దాటితే కఠినచర్యలు

లాక్ డౌన్ గీత దాటితే కఠిన చర్యలు

సారథి, పెద్దశంకరంపేట: తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గం సీఐ జార్జ్ హెచ్చరించారు. బుధవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నాందేడ్- అకోలా 161వ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలతో బయటికి వస్తున్న పలువురికి జరిమానాలు విధించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటకు రావాలని, 10 గంటల తర్వాత ఎవరైనా బయట […]

Read More
30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా దృష్ట్యా అమల్లో ఉన్న లాక్ డౌన్ ను ఈనెల 30వ తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులతో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి అభిప్రాయం మేరకు లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో […]

Read More
అభాగ్యులకు అన్నదానం

అభాగ్యులకు అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయం ముందు రోడ్డు మీద తిరిగే అభాగ్యుల కోసం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు శనివారం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది కలిసి రాజరాజేశ్వర దేవస్థానం వారు అన్నదానం చేశారు. వారికి మధ్యాహ్నం, రాత్రి రెండుపూటలా భోజనం పెట్టనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతిర్తపు మాధవి, ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ పర్యవేక్షకులు శ్రీరాములు, […]

Read More
స్కూటీపై వ్యక్తి చక్కర్లు.. కంగుతిన్న పోలీసులు

స్కూటీపై వ్యక్తి చక్కర్లు.. కంగుతిన్న పోలీసులు

సారథి ప్రతినిధి, సిద్దిపేట: కారును పార్కింగ్ చేసి స్కూటీపై అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. మందుబాబుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎస్సై సజ్జనపు శ్రీధర్ కథనం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కారులో అక్రమంగా మద్యం సీసాలను నిల్వచేశాడు. హుస్నాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ (గోదాంగడ్డ)కు చెందిన సదరు వ్యక్తి స్కూటీపై తిరుగుతుండటంతో అనుమానం వచ్చి స్కూటీని చెక్ చేయగా అందులో మద్యం […]

Read More