రైతు అంశాలపై ప్రధాని మోడీ నిర్లక్ష్యం మద్దతు ధరలు, పరిహారం విషయంలో స్పందనలేదు పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా ఆగ్రహం న్యూఢిల్లీ: రైతుల అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుబట్టారు. రైతు సమస్యలు, సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి స్పందన లేని రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టపరమైన హామీ, మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని […]