సారథి, రాయికల్: ఆపద సమయంలో ఓ యువకుడు గొప్ప మనస్సు చాటాడు. రక్తదానం చేసి మానవతను చూపాడు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన కంచి సాయన్నకు అత్యవసరంగా ‘ఏ’పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దావన్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడు చెలిమెల మల్లేశంను సంప్రదించాడు. సదరు యువకుడు మానవత్వంతో స్పందించి జగిత్యాల హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశాడు. ఇప్పటివరకు తాను 11సార్లు రక్తదానం చేసినట్లు చెప్పాడు. ఈ […]
సారథి, రాయికల్: కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను జగిత్యాల జిల్లా డీఆర్డీఏ విజిలెన్స్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ దేవేందర్ రెడ్డి, డీఆర్డీఏ జిల్లా ఎస్బీఎం కన్సల్టెంట్ జి.చిరంజీవి శుక్రవారం పరిశీలించారు. వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, సానిటరీ వర్క్, పరిశుభ్రత, నర్సరీ, పల్లెప్రకృతి వనం పనులను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఇనుముల రమేష్, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉపసర్పంచ్ అన్నవేణి వేణు, […]