Breaking News

రామాయంపేట

రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్​దే..

రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్​దే..

సారథి, రామాయంపేట: రైతాంగం గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యారని, రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్​ ఏడాదికి రూ.12వేల కోట్ల ఖర్చుతో ఉచితంగా కరెంటు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో నిజాంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించారు. అలాగే నిజాంపేట జడ్పీ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ ను […]

Read More
ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ఆపబోం..

ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ఆపబోం..

సారథి, రామాయంపేట: కరోనాతో రాష్ట్ర ఆదాయం దెబ్బతిన్నప్పటికి కూడా ఏ పథకాలను ఆపకుండా, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పండించిన పంటను నేరుగా కొనుగోలు సెంటర్లలోనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు. ధాన్యం అమ్మిన మూడు నాలుగు […]

Read More
బోల్తాకొట్టిన వలస కార్మికుల బొలేరో

బోల్తాకొట్టిన వలస కార్మికుల బొలేరో

సారథి, రామాయంపేట: కేరళ నుంచి మధ్యప్రదేశ్ కు 10 మంది వలస కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనం నేషనల్ హైవే నం.44పై రామయంపేట స్థానిక పెద్దమ్మ టెంపుల్ వద్ద టైర్ పంచర్ కావడంతో బోల్తాకొట్టింది. అందులో ఉన్న ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.

Read More
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సారథి, రామాయంపేట: పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్టంలో కులవృత్తులను రక్షించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, రజక, నాయీ బ్రాహ్మణులను ఆదుకునేందుకు విద్యుత్ బిల్లు మాఫీ చేయడం పట్ల రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంఘ స్వామి హర్షం వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దోభీఘాట్లకు, లాండ్రీ షాప్, సెలూన్ షాపులకు 250 యూనిట్లలోపు విద్యుత్ బిల్లు మాఫీచేయడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్​ […]

Read More
పంటకు ట్యాంకర్​ నీరే ఆధారం

పంటకు ట్యాంకర్​ నీరే ఆధారం

సారథి, రామాయంపేట: ఈ ఏడాది వర్షాకాలంలో భారీవర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండాయి. రైతులు ఎన్నో ఆశలతో యాసంగి సీజన్ లో వరి సాగుచేయగా, పొట్టదశలోనే బోరుబావులు ఎండిపోతున్నాయి. గత్యంతరం లేక కొందరు రైతులు మురుగు కాల్వల నీళ్లను పంటకు అందిస్తే.. మరికొందరు రైతులు వాటర్ ట్యాంకర్ల సహాయంతో వరి పైరును కాపాడుకుంటున్నారు. మెదక్​జిల్లా రామాయంపేట మండలం రాజకపల్లి పంచాయతీ పరిధిలోని కాసింపుర్ తండాకు చెందిన రైతు లౌడ్య రాంచంద్రం కొద్దిరోజులుగా బోరు నీళ్లుపోయడం లేదు. పొట్టదశలో […]

Read More
ఇంటి నిర్మాణానికి చేయూత

ఇంటి నిర్మాణానికి చేయూత

సారథి, రామయంపేట: గృహ నిర్మాణం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుని మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు నిజాంపేట మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్. మండల పరిధిలోని నందగోకుల్ గ్రామానికి చెందిన కొమ్మట స్వామి నివాసం ఉంటున్న పూరి గుడిసె కూలిపోవడంతో బాధితుడి ఆర్థిక పరిస్థితి బాగులేనందున స్థానిక సర్పంచ్ బుర్ర బాల్ నర్సవ్వ ఇంటి నిర్మాణానికి సహాయం అందించాలని కోరారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి పరిశీలించి నిర్మాణానికి సాయం చేస్తానని హామీఇచ్చారు. ఈ మేరకు […]

Read More
సాగులో కూలీ ఖర్చులు తగ్గించుకోవాలే

సాగులో కూలీ ఖర్చులు తగ్గించుకోవాలే

సారథి న్యూస్, రామాయంపేట: ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే వ్యవసాయంలో మౌలిక మార్పులు సాధ్యమని మెదక్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ అన్నారు. నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామ రైతు వేదికలో శుక్రవారం రైతులకు పంటలో సమగ్ర పోషక యాజమాన్యం పద్ధతులు, వ్యవసాయ రంగానికి అవసరమైన ఉపాధి హామీ పథకం గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుని రైతులు ఎదగవచ్చన్నారు. వరినాట్లు వేసే సమయంలో రైతులకు […]

Read More
మల్చింగ్ సాగు.. బాగు

మల్చింగ్ సాగు.. బాగు

సారథి న్యూస్, రామాయంపేట: మల్చింగ్ పద్ధతుల్లో కూరగాయలను పండించడం ద్వారా ఎక్కువ లాభాలను సాధించవచ్చని మెదక్ జిల్లా డి ఏ ఓ పరుశురాం నాయక్ అన్నారు. కలుపు నియంత్రణలో ఉండి మొక్కకు కావాల్సిన ఎరువులు సమపాళ్లలో అందుతాయని వివరించారు. శుక్రవారం ఆయన మండలంలోని రాజాక్​పల్లి గ్రామంలో మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్న కనుకరాజు అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సూచనలు, సలహాలు ఇచ్చారు.

Read More