సారథి న్యూస్, పస్రా: ములుగు జిల్లా పస్రా గ్రామంలో బుధవారం గండికోట నవీన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.14వేల చెక్కును టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురహరి భిక్షపతి అందజేశారు. ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు చందర్ రాజు, ఎంపీటీసీ వెలిశాల స్వరూప, వార్డు సభ్యులు శ్యాం, పున్నం చందర్, రాజశేఖర్, గజ్జి మల్లికార్జున్, పట్టపు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, తాడ్వాయి: సంఘవిద్రోహ శక్తులు, వివిధ నిషేధిత విప్లవ పార్టీ గ్రూపులకు సహకరించవద్దని తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు సూచించారు. మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామ పంచాయతీ పరిధిలోని రాపట్ల గుత్తికోయగూడెంలో పోలీసు బలగాలతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఇంటిని క్షుణ్ణంగా తనిఖీచేశారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా? లేదా? అనే కోణంలో సోదాలు జరిపారు. అనంతరం గొత్తికోయ ఆదివాసీలందరిని ఒకచోట సమావేశపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక […]
గిరిజన గూడెల్లో పల్స్‌పోలియో చుక్కల మందు వేసిన వైద్యసిబ్బంది సారథి న్యూస్, వాజేడు: మారుమూల అటవీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని పెనుగోలు గుట్టపైకి దాదాపు 36 కి.మీ మేర కాలినడకన నడిచి వెళ్లారు వైద్యసిబ్బంది.. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేశారు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి మందులు ఇచ్చారు. అలాగే జ్వరం ఉన్న ఐదుగురి నుంచి రక్తనమూనాలు సేకరించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, స్టాఫ్ నర్స్ […]
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్లో శనివారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ లోని అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, డీసీవో విజయ్ భాస్కర్ రెడ్డి, ములుగు తహసీల్దార్ ఎం.సత్యనారాయణస్వామి, కలెక్టరేట్ ఏవో జె.శ్యాంకుమార్ పాల్గొన్నారు. వాజేడులో గాంధీజీ వర్ధంతివాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో శనివారం గాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, ఏటూరునాగారం: ఏటూరునాగారంలోని నార్త్ రేంజ్ పరిధిలోని భూపాతిపూర్ బీట్, గురవేళ్ల బీట్‌లో నూతనంగా నిర్మిస్తున్న పెర్కోలేషన్ ట్యాంక్ పనులను డీ ఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి శుక్రవారం పరిశీలించారు. పనులు పూర్తి వెంటనే సోలర్ బోర్వెల్ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో టైగర్ తిరిగిన ప్రదేశం కావునా ఇక్కడ కెమెరా ట్రాప్స్ నిఘా పెంచాలన్నారు. అలాగే వన్యప్రాణుల కదలికలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఆయన వెంట ఏటూరునాగారం ఎఫ్ డీవో వీణావాణి ఉన్నారు.
సారథి న్యూస్, ములుగు: కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎస్టీయూ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సీఆర్టీ ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాలని, హెల్త్‌కార్డులను జారీ చేయాలని డిమాండ్ చేశారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని, హాస్టల్ బాధ్యతలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలని […]
సారథి న్యూస్, ములుగు: ఆమె ఓ ప్రభుత్వ అధికారిణి, ఆకుపచ్చ పెన్నుతో సంతకం చేసేంత హోదా, హలం పట్టి పొలంలో పనులు చేసేంత ఓపిక, రెండు జిల్లాలకు సబ్ రిజిస్ట్రార్ ఆమె.. క్షణం తీరిక లేకుండా తన విధి నిర్వహణలో బిజీగా గడిపే ఓ ఉత్తమ ఆఫీసర్.. కానీ సెలవు దినాల్లో మాత్రం సేద్యం పనులు చేస్తుంటారు. ఎందుకో తెలుసా.. కర్షకుల విలువ ప్రపంచానికి చెప్పడానికే. ఆమె ఎవరో కాదు.. ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ […]
సారథి న్యూస్, మేడారం: మినీమేడారం జాతరకు వచ్చే భక్తులకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అమ్మవారి దయ వల్ల కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందన్నారు. ఏర్పాట్ల కల్పనపై గురువారం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జంపన్న వాగులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. టాయ్‌లెట్స్ వద్ద నిరంతరం నీటి సరఫరా ఉండాలన్నారు. తాగునీటి వసతి కల్పించాలన్నారు. పారిశుద్ధ్య పనుల కోసం తగినంత […]