సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాపర్టీ టాక్స్ ఇతర రెవెన్యూ విభాగం సంబంధిత సమస్యలపై ప్రతి సోమవారం, బుధవారం సదస్సులు నిర్వహించి పరిష్కరించనుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ అవకాశాన్ని సెప్టెంబర్ 15 వరకు కల్పిస్తున్నట్టు పేర్కొంది. రెవెన్యూ సదస్సులు ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతాయని వెల్లడించింది.– డోర్ నంబర్ కోసం […]
మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తప్పనిసరి అధికారులతో సమీక్షించిన సీఎస్ సోమేశ్‌కుమార్ సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు పెండింగ్ విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్నిపంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతినెలా తప్పనిసరిగా కరెంట్ బిల్లులు చెల్లించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బకాయి బిల్లులపై వారంలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. […]
ఇకపై ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు సారథి న్యూస్, హైదరాబాద్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలు, నిల్వలపై భారీ జరిమానాలు విధించేందుకు మున్సిపల్‌శాఖ సిద్ధమైంది. ప్లాస్టిక్ వాడకం.. పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనిపై ప్రజలకు అవగాహన పెంచాలని రాష్ట్రంలోని మున్సిపాలిటీల అధికారులకు సూచించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించడమే కాకుండా.. రిటైలర్లు, వ్యాపారులు ప్లాస్టిక్ వాడకం, అమ్మకాలు జరపకుండా […]
సారథి న్యూస్, హైదరాబాద్: పట్టణాల్లో తాగునీరు, పారిశుధ్యం తదితర కనీస అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కె.తారక రామారావు అధికారులకు సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన సమీక్షించారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు, జిల్లా కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎన్ వీ రెడ్డి, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ప్రగతి భవన్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో వ్యాధుల ప్రభావం, పట్టణ ప్రగతి, పబ్లిక్ మరుగుదొడ్లు, హరితహారం మొక్కల పెంపకం తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.