సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం(నుగూరు) మండలంలోని సూరవీడు కాలనీ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే రహదారిపై మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీనితో వచ్చిపోయే ప్రయాణికులు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ‘కరోనాతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వరవరరావు, వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు 12 మందిని ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని, ఉఫా, ఎన్ఐఏ కేసులను ఎత్తివేయాలని, అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని, జులై 25న తెలంగాణ […]
సారథి న్యూస్, హైదరాబాద్: సీపీఐ(మావోయిస్ట్) పార్టీ తెలంగాణలో మళ్లీ పాగావేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రకమిటీతో పాటు ఏరియా కమిటీలను ప్రకటించి పోలీసులకు సవాల్ విసిరింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారం. ఏడుగురు సభ్యులతో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. పుల్లూరి […]
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు ప్రజలు ఎవరూ నక్సల్స్ కు సహకరించవద్దు వెంకటాపురం ఠాణాను సందర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి సారథి న్యూస్, వాజేడు(ములుగు),భద్రాద్రి కొత్తగూడెం: కొంతకాలంగా ములుగు జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు లేవని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో నక్సలైట్ల అరాచకాలు, ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు. శనివారం ఆయన ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వారం రోజులుగా మావోయిస్టులు కదలికలపై అప్రమత్తమయ్యాం. కొన్నేళ్లుగా […]
సారథిన్యూస్, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ఎంటరయ్యారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు అటవీప్రాంతంలో మూడు మావోయిస్టు బృందాలు తిరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినవస్తుంది. మణుగురు అటవీప్రాంతంలో మావోయిస్టులు తిరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మణుగురు అటవీ ప్రాంతాన్ని 20 ప్రత్యేకబృందాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ప్రాంతంలోని వ్యక్తులపై ఏ మాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సుమారు 400 మంది పోలీసులు మావోయిస్టుల కదలికలపై ముమ్మరంగా గాలిస్తున్నారు.