Breaking News

మానోపాడు

రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్​ మృతి

సారథి న్యూస్​, మానవపాడు: రోడ్డుప్రమాదంలో ఏఆర్​ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన ఏపీలోని కర్నూల్​ సమీపంలో చోటుచేసుకున్నది. ఏఆర్​ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మాధవి ఎమ్మిగనూరు నుంచి కర్నూలు జిల్లా పంచలింగాలకు వెళ్తున్నది. ఈ క్రమంలో తుంగభద్ర బ్రిడ్జిపై వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More
మానోపాడులో కరోనా విజృంభణ

మానవపాడులో కరోనా హైరానా

సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 44 మందికి కరోనా రాపిడ్​ టెస్టులు నిర్వహించగా 14 మందికి కరోనా సోకింది. మానవపాడు -2, కొర్రిపాడు -1, మద్దూరు -2, ఉండవెల్లి మండలంలోని ఉండవెల్లి -1, పుల్లూరు -5, అలంపూర్ క్రాస్​ రోడ్డు -2, ఇటిక్యాల మండలంలో – 1 చొప్పున కేసులు నమోదైనట్టు డాక్టర్​ దివ్య తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, విధిగా […]

Read More
మానోపాడులో కొత్తకేసులు

మానవపాడులో 21 కొత్తకేసులు

సారథి న్యూస్​, మానవపాడు: కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు పీహెచ్​సీ వైద్యురాలు డాక్టర్​ దివ్య సూచించారు. మానోపాడు పీహెచ్​సీ పరిధిలో 75 మందికి పరీక్షలు నిర్వహించగా 21 కేసులు బయటపడ్డాయని చెప్పారు. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జలుబు, దగ్గు , ఆయాసం, జ్వరం ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Read More

కరోనా.. అలసత్వం వద్దు

సారథి న్యూస్​, మానవపాడు: కొంతమంది కరోనాను చాలా తేలికగా తీసుకుంటున్నారని మహమ్మారిపై అలసత్వం ఏ మాత్రం పనికిరాదని జోగుళాంబ గద్వాల జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్​ సునీత పేర్కొన్నారు. కరోనాపై అలసత్వం వహిస్తే అది మన ప్రాణాలనే హరిస్తుందని చెప్పారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సోమవారం మానవపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మానవపాడు మండలంలో సోమవారం ఒక్కరోజే 24 పరీక్షలు చేయగా 12 మందికి కరోనా సోకిందని చెప్పారు. […]

Read More

నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

మానోపాడు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని జోగుళాంబ గద్వాల డీఎంహెచ్​వో చందునాయక్​ పేర్కొన్నారు. గురువారం ఆయన మానోపాడు పీహెచ్​సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్​సీ ఆవరణలో చెత్త పేరుకుపోయి ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. రోగులకు విధిగా శానిటైజర్ లను అందించడంతోపాటు కరోన మహమ్మారి పట్ల భయం తొలగించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సవిత, సూపరవైజర్లు చంద్రన్న, లలిత […]

Read More