ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సారథి న్యూస్, ములుగు: మహాత్మాగాంధీ మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. శుక్రవారం మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ లో గాంధీజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతలు లేకుండా దేశం అభివృద్ధిపథంలో నడిపేందుకు కృషిచేసిన గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు ఇచ్చిన ఘనమైన […]
సారథి న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా శుక్రవారం జరిగాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, […]