టోర్నీ నిరవధిక వాయిదా సేఫ్ ప్లేస్ లోకి ప్లేయర్స్ బీసీసీఐకి రూ.2వేల కోట్ల నష్టం న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై కరోనా పడగ పడింది. ఫలితంగా ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడింది. పలువురు ప్లేయర్లకు కొవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోని బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా వైరస్ బారినపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. […]
ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా శనివారం అనూహ్య నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లూ తనకు అండగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు ఎంఎస్ ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు. 2004లో టీమిండియా జట్టులోకి అరంగ్రేటం చేశాడు. డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. 2005, డిసెంబరు 2న శ్రీలంకతో […]
రాజ్‌కోట్: ఐసీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శశాంక్ మనోహర్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తీవ్ర విమర్శలు చేశాడు. సంక్షోభకాలంలో పదవుల నుంచి తప్పుకోవడం అతనికి అలవాటైందని ధ్వజమెత్తాడు. ‘2015లో బీసీసీఐ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని ఐసీసీకి వెళ్లాడు. ఇప్పుడు బీసీసీఐలో కొత్త నాయకత్వం వచ్చాకా.. స్వలాభం కోసం బోర్డు (ఐసీసీ)ను వాడుకోలేనని తెలిసిపోయింది. దీంతో కరోనా కాలంలో అంతర్జాతీయ బాడీ నుంచి పారిపోతున్నాడు. మనోహర్ సొంత లాభం కోసమే పనిచేస్తాడు. […]
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌పై తుది నిర్ణయం తీసుకోవడంలో.. ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తోందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తమ వల్ల కాదని చెప్పినా.. ఐసీసీ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. ‘నిర్వాహణ దేశమే వద్దు అంటుంటే.. ఐసీసీ మరో ప్రత్యామ్నాయాన్ని చూస్తుందా? ఎందుకీ నాన్చుడు ధోరణి. నిర్ణయాన్ని ప్రకటించే హక్కు ఐసీసీకి ఉన్నా.. ఇతర దేశాల సిరీస్లు, ప్లేయర్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నిర్ణయం ఎంత ఆలస్యమైతే.. అంతర్జాతీయ షెడ్యూల్ […]
ముంబై: టీ20 ప్రపంచకప్‌పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటేనే.. మిగతావన్నీ ప్రణాళికల ప్రకారం జరుగుతాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ద్వైపాక్షిక సిరీస్లు, ఇతర టోర్నీలను పట్టాలెక్కించాలంటే మరికాస్త సమయం పడుతుందన్నాడు. సెప్టెంబర్–అక్టోబర్ విండో లభిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని, లేకపోతే కష్టమేనని చెప్పాడు. ‘ప్రపంచకప్‌పై ఐసీసీ ఏదో ఓ నిర్ణయం చెప్పాలి. వేచి చూడడం వల్ల ఎఫ్టీపీ మొత్తం దెబ్బతింటుంది. కరోనాతో చాలా సిరీస్లు రద్దయ్యాయి. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ను రూపొందించుకోవాలంటే ఐసీసీ నిర్ణయం కీలకం. […]
న్యూఢిల్లీ: శ్రీలంకలో టీమిండియా పర్యటన రద్దయింది. జూన్–జులైలో జరగాల్సిన ఈ పర్యటనలో ఇరుజట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లు ఆడడం సాధ్యం కాదని ఇరుదేశాల బోర్డులు ప్రకటించాయి. అయితే ఎఫ్టీపీ ప్రకారం ఆడాల్సిన సిరీస్‌లను భవిష్యత్‌లో అవకాశం వస్తే ఆడతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ‘జూన్, జులైలో జరగాల్సిన లంక టూర్ సాధ్యం కాదు. ఈ విషయాన్ని లంక బోర్డుకు కూడా చెప్పాం. ప్రస్తుతం […]
ముంబై: ఓవైపు కరోనా మహమ్మారి భయపెడుతున్నా.. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో.. తాము ఐపీఎల్‌కు రెడీగా ఉన్నామని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు లేఖ రాశాడు. అభిమానులను అనుమతించకుండా, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నాడు. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని దాదా తెలిపాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ అన్ని […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉంటుందా? ఉండదా? అన్న అనిశ్చితికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎఫ్టీపీ షెడ్యూల్, కొత్త చైర్మన్, ద్వైపాక్షిక సిరీస్ లపై నేడు ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కరోనా పెరిగిపోతుండటంతో ప్రపంచకప్ పై క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) సుముఖంగా లేకపోవడంతో.. టోర్నీ రద్దు దిశగానే వెళ్తోందని సమాచారం.అయితే ఈ విషయాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని బీసీసీఐ కోరుకుంటోంది. ‘వరల్డ్ కప్ ఉంటుందా? లేదా? అన్నది త్వరగా తేల్చాలి. దీనిపై వేచిచూసే ధోరణి […]