సారథి న్యూస్, రామాయంపేట: బీడీ యాజమాన్యాలు వేతన ఒప్పందాన్ని అమలు చేయాలనితెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈదారి మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేటలో ప్యాకింగ్ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేతన ఒప్పందం ముగిసి దాదాపు ఆరు మాసాలు గడుస్తున్నా బీడీ యాజమాన్యాలు వేతన ఒప్పందం చేయకుండా కార్మికులను దోపిడికి గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బండారి కుమార్, లక్ష్మణ్, బి రాజు, […]