Breaking News

బిజినేపల్లి

అంబేద్కర్, పూలే విగ్రహాలను తీస్తరా... లేదా?

అంబేద్కర్, పూలే విగ్రహాలను తీస్తరా.. లేదా?

ఛత్రపతి శివాజీ సేన పేరుతో ఓ యువకుడి హుకుం సామాజికసారథి, బిజినేపల్లి: ఒకరు ప్రపంచ మేధావి.. దేశానికే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించినవారు. మరొకరు పీడిత ప్రజలకు చదువులు చెప్పించి చైతన్యం నింపిన మహానుభావుడు. ఆ మహనీయులే భారతరత్న డాక్టర్ ​బీఆర్ ​అంబేద్కర్, మరొకరు మహాత్మా జ్యోతిబాపూలే. వారిద్దరి మార్గంలో నడవని వారంటూ ఉండరు. ఆ మహనీయుల విగ్రహాలు ఉండని ఊరంటూ లేదు. ఈ క్రమంలో నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్ పల్లిలో పీడిత, బహుజనవర్గాల ప్రజలు […]

Read More
ఎమ్మెల్యే మర్రికి చుక్కెదురు

ఎమ్మెల్యే మర్రికి చేదు అనుభవం

అడ్డుకున్న వట్టెం భూనిర్వాసితులు సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చుక్కెదురైంది. వట్టెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే అదనంగా లక్ష రూపాయలు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చి నాలుగేళ్లు గడిచినా నేటికీ నెరవేర్చలేదని వట్టెం భూనిర్వాసితులు, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని సోమవారం సాయంత్రం వట్టెం గ్రామంలో అడ్డుకున్నారు. ఆసరా పింఛన్ పంపిణీలో […]

Read More
పింఛన్ల మంజూరులో లీలలెన్నో..!

పింఛన్ల మంజూరులో లీలలెన్నో..!

ఒక ఇంట్లో ఇద్దరికి.. ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్​ ఆసరా లబ్ధిదారుల ఎంపికలో భారీ అక్రమాలు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్​గా లిస్టుల తయారీ ఓకే చెబుతున్న అధికారులు.. అర్హులకు అన్యాయం సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు సంక్షేమ పథకాల అమలు విమర్శలకు దారితీస్తున్నది. ఏదైనా కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడితే గైడ్​లైన్ ప్రకారం అధికారులు లబ్ధిదారులను ఎంపికచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా అధికారపార్టీ […]

Read More
బిజినేపల్లిలో మాయదారి మల్లిగాడు

బిజినేపల్లిలో మాయదారి మల్లిగాడు

నకిలీ కాల్ లెటర్ తో నిరుద్యోగికి టోకరా చాలా మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు దళిత బంధువులో పలువురికి ట్రాక్టర్లు ఇప్పిస్తానని మోసం పడిగాపులు గాస్తున్న బాధితులు సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో ఓ మాయదారి మల్లిగాడు నిరుద్యోగులను నిలువునా ముంచాడు. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని ఉత్తుత్తి కాల్​లెటర్​ఇచ్చి ఉడాయించాడు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. బాధితుడి కథనం.. బిజినేపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లేశ్ గౌడ్ చిన్న చిన్న దందాలు […]

Read More
‘కీచకుడు’ కటకటాల పాలు

‘కీచకుడు’ కటకటాల పాలు

9 మందిపై పోలీసుల కేసు సామాజికసారథి’ వరుస కథనాలతో కదిలిన పోలీసు యంత్రాంగం సామాజికసారథి, బిజినేపల్లి: కారుకొండ గ్రామంలో గౌరమ్మ అనే మహిళపై అత్యాచారం.. ఆపై ఆమెను మోసగించి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు మిద్దె బాలస్వామిని మంగళవారం రిమాండ్​కు తరలించినట్లు నాగర్ కర్నూల్ సీఐ హనుమంతు యాదవ్ మీడియాకు తెలిపారు. ఆయనతో పాటు మరో 9 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులంతా ఒకే కుటుంబ చెందిన […]

Read More
షట్టర్​దక్కలేదని అక్కసు

షట్టర్​ దక్కలేదని అక్కసు!

అధికారులకు ఓ నాయకుడి ఫిర్యాదు సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత సామాజికసారథి, బిజినేపల్లి: తనకు న్యాయం చేయాలని, సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏదైనా పని చట్టవిరుద్ధంగా చేస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేయడంలో తప్పులేదు. కానీ అందులో తనకు వాటా దక్కలేదని ఫిర్యాదు చేయడమే వివాదాస్పదమైంది. ఒక మంచి ఉద్దేశంతో పేదలకు ఉపయోగపడాలన్న తపనతో చేస్తున్న పనిని అడ్డుకోవాలని నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ ముస్లిం నాయకుడు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిజినేపల్లి […]

Read More
బిజినేపల్లిలో ‘ఆ నలుగురు’

బిజినేపల్లిలో ‘ఆ నలుగురు’

పత్రికల పేర్లు చెప్పి డబ్బులు వసూలు యాత్రల పేరుతో జల్సాలు సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో పలు దినపత్రికల పేరు చెప్పి పదిరోజుల నుంచి యాత్రల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఆ నలుగురిపై రెండు రోజులుగా మండలవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ‘ఆ నలుగురు’గా పిలువబడేవారు ఏటా రెండుసార్లు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఓ కారు తీసుకుని తెల్లవారింది మొదలు గ్రామాలపై పడి బెల్టుషాపులు, ఇసుక వ్యాపారులు, ఫర్టిలైజర్​దుకాణాలు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులకు టార్గెట్ […]

Read More
వైభవంగా వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన

వైభవంగా వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లిలో ఆనందగిరిపై ఇటీవల కొత్తగా నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టాపన మహోత్సవంలో గురువారం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయనను ఆలయకమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు, అభిమానులు వెంకట్రామిరెడ్డి, తిరుపతయ్య, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More