Breaking News

బిజినేపల్లిలో మాయదారి మల్లిగాడు

బిజినేపల్లిలో మాయదారి మల్లిగాడు

  • నకిలీ కాల్ లెటర్ తో నిరుద్యోగికి టోకరా
  • చాలా మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు
  • దళిత బంధువులో పలువురికి ట్రాక్టర్లు ఇప్పిస్తానని మోసం
  • పడిగాపులు గాస్తున్న బాధితులు

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో ఓ మాయదారి మల్లిగాడు నిరుద్యోగులను నిలువునా ముంచాడు. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని ఉత్తుత్తి కాల్​లెటర్​ఇచ్చి ఉడాయించాడు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. బాధితుడి కథనం.. బిజినేపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లేశ్ గౌడ్ చిన్న చిన్న దందాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో వెల్కిచర్ల గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగికి ఖమ్మం జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం ఇప్పిస్తానని గతకొద్ది రోజుల క్రితం నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడు. నకిలీ కాల్​లెటర్​చేతిలో పెట్టాడు. ఉద్యోగం రాకపోవడంతో మల్లేష్​గౌడ్​ను ఆశ్రయించాడు. అందుకు ఆయన ఓ చెక్కు రాసి ఇచ్చాడు. చెక్కు చెల్లుబాటు కాకపోవడంతో ఇంటికి వెళ్లి నిలదీయగా.. అప్పటికే పరారయ్యాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది బాధితులు మాయదారి మల్లేశ్​గౌడ్​చేతిలో మోసపోయారు. బయటికి చెప్పుకోలేక నిత్యం బిజినేపల్లిలో పడిగాపులు గాస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ‘సామాజికసారథి’ వారం రోజులుగా పలువురు బాధితుల నుంచి వివరాలు సేకరించగా రేవల్లి గ్రామానికి చెందిన కొందరి వద్ద మెడికల్​సీట్లు ఇప్పిస్తానని బాండు పేపర్​రాసిచ్చి ఒక్కొక్కరి వద్ద రూ.9 నుంచి రూ.12 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా దళితబంధువు లో ట్రాక్టరు ఇప్పిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసుకుని ఉడాయించాడు.

మహాదేవునిపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి బిజినేపల్లిలో నకిలీ ప్లాట్లు అమ్మకాలుచేసి ఆ వ్యక్తి నుంచి రూ.9 లక్షలను వసూలు చేసుకుని రిజిస్ట్రేషన్ నాటికి ఆ ప్లాటు మల్లేశ్​గౌడ్​కు చెందినది కాదని తెలియడంతో ఆ వ్యక్తి నివ్వెరపోయి తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తికి కూడా ఒక చెల్లని చెక్కు ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అంతే కాకుండా బిజినేపల్లిలో పలువురు గౌడ సంఘానికి చెందిన వ్యక్తుల వద్ద మద్యం సరఫరా చేస్తానని లక్షలాది రూపాయలు తీసుకుని వారికి కూడా టోకరా వేశాడు. ఈ తతంగమంతా బిజినేపల్లిలో గుసగుసలుగా చేరి బాధితుల బాధలు ఒకరు ఒకరు చెప్పుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. కనీసం బాధితులు పోలీస్​స్టేషన్​కు వెళ్లి బాధలు చెప్పుకుని ఫిర్యాదుచేస్తే తమకు న్యాయం జరుగుతుందో లేదోనని మదనపడుతున్నారు. ఇకనైనా మాయాదారి మల్లిగాడి నుంచి న్యాయం చేయాలని కోరుతున్నారు.

3 thoughts on “బిజినేపల్లిలో మాయదారి మల్లిగాడు

  1. సామాజిక సారథి వంగూర్

    వంగూర్ మండలం లోని సర్వ రెడ్డి పల్లి తాండ (కిష్టం పల్లి )గ్రామానికి చెందిన నేనావత్ సూర్య గారి తండ్రి నేనావత్ బొజ్జ అకాల మరణం తో వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

  2. సామాజిక సారథి వంగూర్

    వంగూర్ మండలం లోని సర్వారెడ్డిపల్లి తండా (కిష్టం పల్లి )గ్రామానికి చెందిన నేనావత్ సూర్య గారి తండ్రి నేనావత్ బొజ్జ అకాల మరణం తో వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

Comments are closed.