సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రభుత్వం పేద, బడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. కొత్త బట్టలతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లు అందజేస్తున్నామని చెప్పారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆర్డీవో సాయిరాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, కౌన్సిలర్ లతో కలిసి 20 మంది క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకెట్లు […]
సారథి న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భారీవర్షాలతో రైతులు అల్లాడుతుంటే జిల్లాకు చెందిన సివిల్ సప్లయీస్ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్ ప్రశించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ చీరల పంపిణీపై ఉన్న శ్రద్ధ అకాలవర్షంతో అల్లాడుతున్న రైతులపై లేదన్నారు. కనీసం రైతులకు భరోసా కల్పించే సమయం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు పేరుతో రైతులను […]
సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. 287 డిజైన్లతో బంగారు, వెండి అంచులో చీరలను తయారుచేసినట్లు వెల్లడించారు. రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. బతుకమ్మ పండుగకు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు. మంగళవారం బేగంపేట హరితప్లాజాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రులు కె.తారక రామారావు, సబితాఇంద్రారెడ్డి, […]