సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అడిషనల్కలెక్టర్ మనుచౌదరి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం ఏడు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఐకేపీ ఏపీఎం, విద్యుత్ శాఖ సిబ్బంది పనితీరుపై మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పనితీరు మార్చుకుని ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని సూచించారు. శుక్రవారం రామాయంపేట పేట సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మృతిచెందిన పెద్దశంకరంపేట 1వ ఎంపీటీసీ రాజమణి లక్ష్మీనారాయణ మృతికి నివాళులర్పించారు. బద్దారం, శివాయిపల్లి, చిల్లపల్లి, ఉత్తులూర్ గ్రామాల్లో కరెంట్ తీగలు కిందకు వేలాడుతున్నాయని ఆయా […]
సారథి న్యూస్, వాజేడు, ములుగు: ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి కె.రమాదేవి సూచించారు. సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో ప్రజావిజ్ఞప్తులు, ఈ- ఆఫీస్, పల్లెప్రగతి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటివరకు 646 దరఖాస్తులు రాగా, 358 పరిష్కరించామని, 288 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజావాణిలో 21 రెవెన్యూ శాఖకు సంబంధించి, మూడు ఆసరా పెన్షన్లు, […]
సారథి న్యూస్, ములుగు: కలెక్టరేట్ లో ప్రజల నుంచి సోమవారం విజ్ఞప్తులు స్వీకరించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య తెలిపారు. భూసమస్యలకు సంబంధించి 25, సదరం పెన్షన్లకు సంబంధించి మూడు, ఇతర శాఖలకు సంబంధించి మూడు .. మొత్తం 31 విజ్ఞప్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్-19 నియంత్రణ దృష్ట్యా భౌతిక దూరాన్ని పాటించి, వచ్చిన దరఖాస్తులను శానిటైజేషన్ కు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాస్క్లు తప్పకుండా కట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని కలెక్టర్ సూచించారు.