సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. రాష్ట్రప్రభుత్వం త్వరలోనే కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. పురపాలకశాఖలో వార్డు ఆఫీసర్లు అనే కొత్తపోస్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్లో తన శాఖ అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లను నియమించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. వార్డు ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. […]