సామజిక సారథి, వాజేడు: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సినేషన్ను వేయించుకోవాలని వైద్యాధికారి డాక్టర్ యమున తెలిపారు. మంగళవారం వాజేడు మండలంలో కరోనా టీకా మానవాళికి రక్షణ అని వాజేడు వైద్య సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి పంట పొలాల్లో కూడా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ ఈశ్వరమ్మ. వైద్య సిబ్బంది శేఖర్. ఛాయాదేవి,ఆశ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు
సామాజిక సారథి, ఏన్కూరు: రైతులు సాగు చేసిన మిరప తోటలపై తామర పురుగు తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంది. దీంతో పంట దెబ్బతిని రైతులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో మిరప సాగు చేశారు. ఆశించిన ధర ఉండటంతో చాలా మంది రైతులు మిరప సాగుపై ఎక్కువ ఆసక్తి కనపర్చారు. మండలంలో గత ఏడాది కేవలం ఐదువేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా ఈ ఏడాది సుమారు […]
సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పాలడుగు, రెబ్బవరం, గొల్లపూడి గ్రామాల్లో వైరస్ సోకిన మిర్చి తోటలను శనివారం ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మిర్చి తోటలకు తామరపురుగు తెగులు ఆశిస్తున్నట్లు గుర్తించారు. దీని నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారిణి అపర్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్, ఏఈవోలు వెంకట్ నర్సయ్య, వాసంతి కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
సామాజిక సారథి, కౌడిపల్లి: యాసంగి లో పంటల సాగు పగడ్బందీగా సర్వే నంబరు ప్రకారం ప్రతి రైతు పంట సాగు వివరాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్ సూచించారు. బుధవారం కౌడిపల్లి రైతు వేదికలో కౌడిపల్లి డివిజన్ లోని నాలుగు మండలాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం వాన కాలంలో అధిక మొత్తంలో వరి పండించడం […]