సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్యపనులను వెంటనే మొదలు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. నిధులు విడుదలైనప్పటికీ డంపింగ్యార్డు, శ్మశానవాటిక పనులు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు వారు సోమవారం రామడుగు డివిజినల్ పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు పురేళ్ల శ్రీకాంత్, అనుపురం పరుశరాం, ఉపసర్పంచ్ రాజేందర్ తదితరులు ఉన్నారు.
సారథి న్యూస్, రామాయంపేట: కరోనా విధుల్లో ఫస్ట్ వారియర్స్ గా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ రూ.ఐదువేల ఇన్సెంటివ్ ప్రకటించగా, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇన్సెంటివ్తో పాట పెరిగిన రూ.8,500 జీతం ఇవ్వాలని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. సోమవారం రాత్రి మెదక్ జిల్లా ఉమ్మడి రామాయంపేట మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఆయా పంచాయతీ ఆఫీసుల వద్ద ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవోనం.51 పేరుతో […]