సారథి, రామాయంపేట: నకిలీ సీడ్స్, ఫర్టిలైజర్ గానీ రైతులకు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసునమోదు చేసి జైలుకు పంపిస్తామని నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ ఫర్టిలైజర్ షాప్ దుకాణాల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పలు విత్తన, ఫర్టిలైజర్ షాపులను ఆయన తన సిబ్బందితో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ సీడ్స్ గురించి ఎలాంటి సమాచారం రైతుల దగ్గర ఉన్నా పోలీస్ సిబ్బంది, […]
సారథి, మల్దకల్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై దృష్టిపెట్టారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ ఎస్సై శేఖర్ తన సిబ్బందితో పక్కా సమాచారంతో దాడులు చేసి 30 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. రైతులకు ఎవరు నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు..