సారథి న్యూస్, బిజినేపల్లి: శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా ప్రత్యేక పూజలు అందుకున్నారు. రెండవ రోజు ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సుమలత దంపతులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. పాడిపంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.
సారథి న్యూస్, నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ ఆలయంలో ఆదివారం దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీనవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పురోహితులు వేలేటి లక్ష్మణశాస్త్రి మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో దుర్గామాత కమిటీ సభ్యులంతా భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు కట్టుకుని అమ్మవారి సేవకు అంకితమయ్యారని తెలిపారు. గ్రామస్తుంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.
మొదటి రోజు శైలపుత్రికగా జోగుళాంబ అమ్మవారు అక్టోబర్ 25వ తేదీ వరకు వేడుకలు సారథి న్యూస్, అలంపూర్, మెదక్: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శనివారం దేవీశరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్19 నిబంధనల మేరకు ఆర్భాటాలకు దూరంగా సంప్రదాయాలు ఉట్టిపడేలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు జోగుళాంబ అమ్మవారిని నవదుర్గాల్లో ఒకరిగా అలంకరించి ఆరాధించడం ఆనవాయితీ. మొదటి రోజు కావడంతో జోగుళాంబ అమ్మవారు […]