Breaking News

దేవరకద్ర

ఎమ్మెల్యే.. ‘ఆల’ అలా..

ఎమ్మెల్యే.. ‘ఆల’ అలా..

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్ పల్లి బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కొద్దిసేపు సందడి చేశారు. కాసేపు గాలంతో చేపలు పట్టారు. చిన్నచింతకుంట మండలంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి తిరుగు ప్రయాణంలో బండర్​పల్లి వద్ద ఆగారు. అక్కడే చేపలు పడుతున్న వారి వద్దకు వెళ్లి గాలం తీసుకుని చేపలుపట్టారు. వాటిని చేతిలోకి తీసుకుని చూసి ముచ్చటపడ్డారు. […]

Read More
పత్తిరైతు కన్నీరు

పత్తిరైతు కన్నీరు

సారథి న్యూస్, దేవరకద్ర: ఈ ఏడాది కాలం కలిసొచ్చిందనుకుంటే ముసురు వర్షం రైతులను కన్నీరు పెట్టిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలంలోని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు పత్తి పొలాల్లోకి విపరీతంగా నీరు వచ్చిచేరింది. దీంతో పంటంతా ఊట ఎక్కుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దేవరకద్ర మండలంలో ఈ ఏడాది సుమారు 11వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. మండలంలోని గోపనపల్లి, పుట్టపల్లి, కౌకుంట్ల, రాజోలి, వెంకటగిరి, వెంకంపల్లి […]

Read More
నిండుకుండలా కోయిల్ సాగర్

నిండుకుండలా కోయిల్ సాగర్

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ ​జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ నిండుకుండలా మారింది.. భారీవర్షాలకు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం నీటిమట్టం 30 ఫీట్లకు చేరింది. కోయిల్​సాగర్ ప్రాజెక్టును 1954 లో నిర్మించారు. అప్పటి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కేఎం ఖర్జూ ప్రాజెక్టును ప్రారంభించి మొట్టమొదటిసారిగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టును అప్పట్లో కేవలం వర్షాధారం ప్రాతిపదికగానే 12వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా నిర్మించారు. ఆ తర్వాత ఎత్తిపోతల పథకంగా మార్చారు. ఇక్కడి నుంచి […]

Read More
సరళాసాగర్ నీటి విడుదల

సరళాసాగర్ నీటి విడుదల

సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల పంట పొలాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం సాగునీటిని విడుదల చేశారు. గత డిసెంబర్ 31న ప్రాజెక్టు కట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లడంతో ఫండ్స్​రిలీజ్​ చేయించి యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. రైతులు ఇబ్బందిపడకుండా సాగునీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.

Read More