సారథి న్యూస్, హైదరాబాద్: తిరునగరి రామానుజం తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని ప్రశంసించారు. మహాకవి దాశరథి పురస్కారాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో రామానుజంకు అందజేశారు. శాలువా కప్పి సన్మానించారు. రామానుజం రాసిన ‘బాలవీర శతకం’, ‘అక్షరధార’, ‘తిరునగరీయం’ రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనస్తామన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆయన అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. సాహిత్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తూ.. అవార్డులను […]