Breaking News

తుంగభద్ర

అమ్మవారికి పుష్కర స్నానం

అమ్మవారికి పుష్కర స్నానం

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ లో బుధవారం ఏకాదశి రోజున ప్రభాత సంకీర్తనం, అమ్మవారి పుష్కరస్నానం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ నారాయణమ్మ, గ్రామస్తులు గిరిధర్ రెడ్డి, పరమేశ్వర్​ రెడ్డి, గజేందర్ రెడ్డి, ఏకాంత్, నీలప్ప తెలిపారు. జ్యోతిర్వాస్తు పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రెండొందల మంది బ్రాహ్మణులతో ప్రత్యేకపూజలు, అమ్మవారికి పుష్కరస్నానం ఉంటుందని పేర్కొన్నారు. […]

Read More
తుంగభద్ర పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

తుంగభద్ర పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

సారథి న్యూస్, అలంపూర్ ​(జోగుళాంబ గద్వాల): ఈనెల 20వ తేదీ నుంచి జరిగే తుంగభద్ర నది పుష్కరాల నేపథ్యంలో ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ సోమవారం అలంపూర్ లోని పుష్కర ఘాట్ ను, జోగుళాంబ ఆలయాల సముదాయాన్ని సందర్శించారు. పుష్కర ఘాట్ ప్రాంతంలో వీఐపీ పార్కింగ్, సాధారణ భక్తుల వాహనాలకు పార్కింగ్, అలాగే వృద్ధులు, దివ్యాంగులకు కల్పించే ఉచిత పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అమ్మవారి ఆలయం, స్వామివారి ఆలయంలోకి వచ్చే మార్గాలు, బయటకు వెళ్లే మార్గాలను గుర్తించి […]

Read More
తుంగభద్ర పుష్కరాలకు పక్కాగా ఏర్పాట్లు

తుంగభద్ర పుష్కరాలకు పక్కాగా ఏర్పాట్లు

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): అయిజ మండలం వేణిసొంపురం గ్రామంలో తుంగభద్ర నది పుష్కరాల ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే అబ్రహం పరిశీలించారు. విద్యుద్దీకరణ, మహిళల స్నానాల గదులు, వాహనాల పార్కింగ్ స్థలం.. తదితర వాటికి సంబంధించి అడిషనల్​ కలెక్టర్ ​శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ కృష్ణ, ఆర్డీవో రాములుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. రాష్ట్రంలో తుంగభద్ర నది ఒక్క అలంపూర్ నియోజకవర్గంలో మాత్రమే ప్రవహిస్తుందని, పవిత్రమైన పుష్కరాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని […]

Read More
పుష్కరాల ప్రణాళిక రూపొందించండి

పుష్కరాల ప్రణాళిక రూపొందించండి

సారథి న్యూస్​, కర్నూలు: నవంబర్​ 20 నుంచి డిసెంబర్​ 1వ తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని జేసీ–2(అభివృద్ధి) రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్​లో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, హౌసింగ్‌ పీడీ, ఎన్‌ఐసీ జిల్లా ఇన్‌చార్జ్‌ అరుణతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, ఏర్పాట్లకు సంబంధించి త్వరగా నివేదిక సమర్పించామన్నారు. జిల్లాలోని మంత్రాయం, కౌతాళం, కోడుమూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే […]

Read More
11 ఏళ్లుగా మానని వరద గాయం

11 ఏళ్లుగా మానని వరద గాయం

అన్నీ కోల్పోయిన కృష్ణా, తుంగభద్ర నదీతీర వాసులు ఎవరిని పలకరించినా కన్నీళ్లే నేటికీ ఇండ్లు కట్టలే.. స్థలాలు ఇవ్వలే మద్దూర్ లో నేటికీ అడుగుపెట్టని జిల్లా కలెక్టర్, మంత్రులు సారథిన్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా తుంగభద్ర, కృష్ణానది తీర గ్రామాల ప్రజల్లో నాటి వరద భయం ఇంకా వీడడం లేదు. చిన్నపాటి వర్షం వచ్చిన నదులు పొంగుతాయని, వరద వస్తుందేమోననే గుబులు వెంటాడుతోంది. 11 ఏళ్ల క్రితం..2009 అక్టోబర్​ 2న సంభవించిన ఆ రెండు […]

Read More
హంద్రీ, తుంగభద్ర నీటిశుద్ధికి శ్రీకారం

హంద్రీ, తుంగభద్ర నీటిశుద్ధికి శ్రీకారం

సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని స్థానిక జమ్మిచెట్టు సమీపంలో ఉన్న హంద్రీ నది వద్ద అమృత్ పథకం నిధులతో మురుగు నీటి శుద్ధికి రూ.47.93కోట్లతో పనులను ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, మున్సిపల్కా ర్పొరేషన్​కమిషనర్ డీకే బాలాజీ ఆదివారం ప్రారంభించారు. హంద్రీ, తుంగభద్ర నుంచి వచ్చే మురుగు నీరు డైరెక్ట్​గా వెళ్లిపోవడం ద్వారా తాగినవారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. తుంగభద్ర హంద్రీ నీటిలో ఒక్క చుక్క వృథా కాకుండా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ […]

Read More
వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

ఏర్పాట్లకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం ఎమ్మెల్యేకు హామీ ఇచ్చిన జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్​యాదవ్​ సారథి న్యూస్, కర్నూలు: పన్నెండేళ్లకోసారి వచ్చే తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, అందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌కు హామీ ఇచ్చారు. శుక్రవారం అమరావతిలో నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా […]

Read More
తుంగభద్రలో యువకుడి డెడ్​బాడీ లభ్యం

తుంగభద్రలో తేలిన యువకుడి డెడ్​బాడీ

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర నదిలో పుట్టిలో వెళ్తూ గల్లంతైన రవికుమార్ మృతదేహం ఆచూకీ మంగళవారం దొరికింది. నదిలోనే చేపలవలకు ​డెడ్​బాడీ చిక్కింది. పోస్టుమార్టం కోసం అలంపూర్ ​ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, తుమ్మిళ్ల గ్రామానికి చెందిన అంజి, రాఘవేంద్ర ప్రతిరోజు మద్యం సరుకును తుంగభద్ర నది నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రవికుమార్ కు చెందిన పుట్టిలో 36మద్యం కేసులను తీసుకుని అవతలి వైపునకు దాటుతున్నారు. మార్గమధ్యంలో పుట్టి మునిగిపోవడంతో […]

Read More