సామాజికసారథి, తాడూరు: ఓ పంచాయితీ విషయంలో దివ్యాంగుడిపై సర్పంచ్ప్రతాపం చూపించాడు. సర్దిచెప్పాల్సింది పోయి సదరు వ్యక్తిపై పిడిగుద్దులకు దిగాడు. దీంతో ఆయన దవడ దెబ్బతినడంతో లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన గురువారం తాడూరు మండలం అల్లాపూర్‌లో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఆవుల తిరుపతయ్య భిక్షాటన చూస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని సోదరుడి కుమారుడు బాలకృష్ణ, అదే గ్రామానికి చెందిన శాంతయ్య గొడవపడ్డారు. ఈ విషయమై ఆవుల తిరుపతయ్యతో మాట్లాడేందుకు గ్రామ సర్పంచ్ జి.నిరంజన్ […]
ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఔదార్యం తాడూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి రెండెకరాల భూదానం తన సతీమణి స్మారకార్థం విద్యాభివృద్ధికి శ్రీకారం సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు సామాజిక సారథి, నాగర్‌కర్నూల్: పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత కారణంగా చాలా పేదపిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఉన్నత చదువులు చదవాలని ఉన్నా కుటుంబ, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోడంతో ఎంతోమంది ఆడబిడ్డలు చిన్నతనంలోనే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. చదువులకు పేదరికం అడ్డకాకూడదని, పేదింటి బిడ్డలు ఉన్నత చదువులు చదివి గొప్పగా రాణించాలని […]
సారథి, తాడూరు: పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి దళితబంధు సహాయం అందజేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడిచినా దళితుల అభ్యున్నతికి అరకొర నిధులు కేటాయిస్తూ మొండిచేయి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు రూ.10లక్షల రుణసహాయం ప్రతి లబ్ధిదారుడికి ఇవ్వాలని కోరారు. ప్రతి దళిత […]