ములుగులో సీతక్క నిరసన సామాజిక సారథి, ములుగు: స్థానికత కోసమే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్చేస్తూ గురువారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలలో ప్రాధాన్యత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని […]