Breaking News

గద్వాల

నేనున్నాను.. దిగులు వద్దు

నేనున్నాను.. దిగులు వద్దు

ఎమ్మెల్యే అబ్రహం భరోసా కల్లుతాగి మృతిచెందిన కుటుంబాలకు పరామర్శ సారథి, మానవపాడు: కల్తీ కల్లు తాగి చనిపోయిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ఆదివారం మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చేరుకుని పరామర్శించారు. నాయక వెంకటరాముడు కుటుంబానికి రైతుబీమా పథకం ద్వారా రూ.ఐదు లక్షలు ప్రభుత్వం నుంచి త్వరగా వచ్చే విధంగా చేయాలని వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. వెంకన్నకు టీఆర్ఎస్ పార్టీ సాధారణ సభ్యత్వం ఉందని, పార్టీ నుంచి సహకారం […]

Read More
నకిలీ విత్తనాల పట్టివేత

నకిలీ విత్తనాల పట్టివేత

సారథి, మల్దకల్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై దృష్టిపెట్టారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ ఎస్సై శేఖర్ తన సిబ్బందితో పక్కా సమాచారంతో దాడులు చేసి 30 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. రైతులకు ఎవరు నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు..

Read More
బాలయోగి ఇక లేరు

బాలయోగి ఇక లేరు

సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురంలో బాలయోగి శివనారాయణస్వామి కన్నుమూశారు. స్వామివారు 76 ఏళ్లుగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శివనారాయణ స్వామి ఇక లేరనే వార్తను భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివనారాయణ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు విశేషసంఖ్యలో తరలివచ్చేవారు. స్వామివారు లేక లేరని భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read More
కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

సారథి, మానవపాడు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపధ్యంలో ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవడంతో పాటు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని డాక్టర్ సవిత సూచించారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సిన్ నేషన్ నిర్వహించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కరోనా నివారణ టీకాను వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు వద్దని ఆమె సూచించారు. ఏదైనా అత్యవసర పనిమీద బయటకొచ్చి ఇంటికి వెళ్లి తప్పనిసరిగా కాళ్లు, చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలని […]

Read More
టీఆర్ఎస్​ప్రభుత్వానికి అండగా ఉందాం

టీఆర్ఎస్ ​ప్రభుత్వానికి అండగా ఉందాం

జడ్పీటీసీ కాశపోగు రాజు, ఎంపీపీ రజితమ్మ 50 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ సారథి, వడ్డేపల్లి(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్​వీఎం అబ్రహం ఆదేశాల మేరకు శుక్రవారం వడ్డేపల్లి తహసీల్దార్ ​ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తహసీల్దార్​ మధుసూదన్​రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు, ఎంపీపీ రజితమ్మ, మున్సిపల్ చైర్మన్ కరుణమ్మ 50 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. రామాపురం, జిల్లేడుదిన్నె, కొవెలదిన్నె, బుడమరసు, జులకల్, గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన రూ.5,105,916 విలువైన చెక్కులను […]

Read More
45 ఏండ్లు నిండినవారు వ్యాక్సిన్​ తీసుకోండి

45 ఏండ్లు నిండినవారు వ్యాక్సిన్​ తీసుకోండి

సారథి, మానవపాడు: ఎలాంటి అపోహలకు భయపడకుండా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని మానవపాడు పీహెచ్​సీ డాక్టర్​శశికిరణ్​కోరారు. శనివారం స్థానిక మానవపాడు పీహెచ్​సీని గద్వాల డీఐవో డాక్టర్ శశికళ సందర్శించి వార్డుల రూములను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సమయానికి మిమ్మల్ని పట్టించుకుంటున్నారా? లేదా? ఏమైనా ఆరోగ్య విషయంలో ఇబ్బంది వస్తే వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నారా? లేదా? అన్న అంశాలను ఆరాతీశారు. 45 ఏండ్లు పైబడిన వారు తప్పకుండా కరోన టీకాను వేయించుకోవాలని […]

Read More
‘వకీల్​సాబ్’ ఫ్యాన్స్​రచ్చరచ్చ.. ఎందుకో తెలుసా?

‘వకీల్​సాబ్’ ఫ్యాన్స్​ రచ్చరచ్చ.. ఎందుకో తెలుసా?

సారథి, మానవపాడు(గద్వాల): వపర్​స్టార్ పవన్​కళ్యాణ్​ న్యాయవాది పాత్రలో నటించిన వకీల్​సాబ్ సినిమా విడుదల సందర్భంగా ఆయన అభిమానులు రచ్చ రచ్చ చేశారు. థియేటర్​ లో గందరగోళం సృష్టించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస టాకీస్ లో శుక్రవారం వకీల్ సాబ్ సినిమా మొదటి ఆట శాటిలైట్ ద్వారా ప్రారంభమైంది. సినిమా షురూ అయిన కొద్దిసేపటికే అర్ధాంతరంగా ఆగిపోవడంతో పవర్​స్టార్ ​ఫ్యాన్స్ ​ఆగ్రహించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులై కుర్చీలు, తలుపులను విరగొట్టారు. మళ్లీ సినిమా స్టార్ట్ ​కావడంతో […]

Read More
అపోహలు వీడి టీకా వేయించుకోండి

అపోహలు వీడి టీకా వేయించుకోండి

సారథి, మానవపాడు: మానవపాడు సర్పంచ్​ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి కరోనా టీకా వేసుకున్నారు. ఎలాంటి అపోహలకు భయపడకుండా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆత్మ లింగారెడ్డి కోరారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్​ సవిత, హెల్త్ సూపర్ వైజర్ చంద్రన్న, ఫార్మసిస్ట్ తీరుమల్, స్టాఫ్ నర్స్ మహాలక్ష్మి, ఏఎన్​ఎం మున్ని, షాజహాన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సోని, ఆశా వర్కర్లు ఉన్నారు.

Read More