సారథి, హుస్నాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి పంటలు నీరు లేక ఎండుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిద్దిపేట సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. వానాకాలంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా అన్నదాతలు ఆనందంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి పంటలు వేశారని చెప్పారు. పంటలన్నీ పొట్టదశలో ఉన్నాయని, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఎండిపోతున్నాయని […]
సారథి న్యూస్, హుస్నాబాద్: గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీ రజత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టును రీ డిజైన్ చేసిన తర్వాత పనులు చేపట్టకుండా పూర్తిగా నిలిచిపోయాయన్నారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న భూమి నిర్వాసితులకు నష్ట పరిహారం అందించకుండా జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన యువకులకు ఆర్అండ్ఆర్ […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్షలో భాగంగా సిద్దిపేట్ జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల భూమిపూజ […]