బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోయిన గంగవ్వ శనివారం అనూహ్యంగా బయటకు వచ్చేసింది. నిజానికి గంగవ్వ ఈ వారం నామినేషన్లో కూడా లేదు. కానీ ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. దీంతోపాటు కుటుంబసభ్యులు, ఊరి వాతావరణానికి దూరమై ఆందోళన చెందుతున్నది. ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. తనను ఇంటికి పంపించాలని ఇప్పటికే పలుమార్లు వేడుకున్నది. హల్త్రిపోర్ట్స్ చూసిన నాగర్జున అవ్వను బయటకు పంపేందుకు ఒప్పుకున్నాడు. స్టేజి మీదికి రాగానే గంగవ్వ డ్యాన్స్ చేసిందంటే ఆమె హౌస్‌లో ఎంత […]
తొలుత కొంత చప్పగా సాగిన బిగ్‌బాస్ హౌస్ ఈ మధ్య ఊపందుకున్నది. బిగ్‌బాస్ ఇస్తున్న వైవిధ్యభరితమైన టాస్కులతో ప్రేక్షకుల్లోనూ కొంత ఆసక్తి పెరిగింది. అయితే హౌస్ లో వినోదం కాస్త తగ్గడంతో ఇప్పటికే ముక్కు అవినాశ్, కుమార్ సాయి అనే ఇద్దరు కమెడీయన్లను దించారు. అవినాశ్ కాస్త బాగానే వినోదం పండిస్తున్నా.. కుమార్‌సాయి మాత్రం ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మరో హాట్ హీరోయిన్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు […]
సారథిన్యూస్, హైదరాబాద్: బిగ్‌బాస్ హౌస్‌లో పనిచేస్తున్న కొంతమంది టెక్నిషియన్లకు కరోనా సోకినట్టు సమాచారం. దీంతో బిగ్‌బాస్ హౌస్ నిర్వాహకుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. అయితే గత హౌస్‌లో అత్యధిక ఓట్లతో దూసుకుపోతున్న గంగవ్వకు కూడా రెండ్రోజులుగా అనారోగ్యంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఆమె నేరుగా బిగ్‌బాస్‌కే చేప్పేశారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన బిగ్‌బాస్ టీం వెంటనే గంగవ్వకు కరోనా టెస్టు చేయించినట్టు సమాచారం. శుక్రవారం ఉదయమే ఆమె నుంచి శాంపిల్లు తీసుకున్నారట. అయితే ఆమెకు […]