ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భయంకరంగా పెరుగుతున్నది. కొత్తగా 34,000 కొత్తకేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 10,38,716 లకు చేరుకున్నది. కాగా ఇప్పటికే 26,273 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా పట్టణప్రాంతాలతోపాటు గ్రామాలకు ఈ మహమ్మారి విస్తరించింది. రానున్నరోజుల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 6,53,750 మంది కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశమే. ప్రభుత్వాలు చేతులెత్తేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కొత్తకేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 32 వేల కొత్తకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు భారత్లో 9,68,876 కేసులు నమోదయ్యాయి. 6,12,814 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 24, 915 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,31,146 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్ లాంటి […]
ఢిల్లీ: భారత్లో కరోనా కేసులో సంఖ్య భయంకర స్థాయిలో పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,429 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,36,181 కి చేరింది. ఈ కాగా ఒకే రోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కరోనాతో 24,309 మంది మృత్యువాత పడ్డారు. 5,92,031 మంది కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో 3,19,840 మంది చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.