సారథి న్యూస్, అచ్చంపేట: రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, బుడ్డతండా, హాజీపూర్ గ్రామాల సర్పంచ్లకు వినతిపత్రాలు ఇచ్చారు. లాక్డౌన్ సందర్భంగా వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, విద్యార్థులు, ప్రైవేట్ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనాకు ఉచితంగా వైద్యచికిత్సలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ […]
సారథిన్యూస్, గోదావరిఖని: మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల పోరాటం ఫలించింది. వారికి పూర్తిస్థాయి వేతనాలు చెల్లించడంతోపాటు ఇతర డిమాండ్లు నెరవేర్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం సమీపంలోని కేశోరాం కర్మాగారంలో పనిచేస్తున్న దాదాపు 1300 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొమ్మిది రోజులుగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. దిగివచ్చిన కేశోరాం ఫ్యాక్టరీ వారి డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది. దీంతో కార్మికులు ఆందోళన […]