సారథి న్యూస్, ములుగు: లాక్డౌన్తో ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు సోమవారం ములుగులో ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, ఆక రాధాకృష్ణ, మైల జయరాం రెడ్డి, నమాకరం చంద్ బానోతు రవి చందర్, మామిడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్ : అధిక విద్యుత్ బిల్లులతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా కోహెడ, బెజ్జంకి మండల విద్యుత్ శాఖ ఏడీ మాణిక్య లింగానికి వినతి పత్రాన్ని అందజేసి మాట్లాడారు. పేద ప్రజలు నిత్యావసర వస్తువులు కొనేందుకు డబ్బులు లేక సతమతమవుతుంటే విద్యుత్ బిల్లులు రూ.1000కి పైగా వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ […]