సారథి న్యూస్, కర్నూలు: దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక నగర పాలకసంస్థ ఆఫీసులో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కమిషనర్ బాలాజీ అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. క్విట్ ఇండియా పోరాటం తరహాలో నేడు ప్రస్తుత కరోనా విపత్తు సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరం నలుదిశలా విస్తరిస్తోంది. నగర పాలక సంస్థ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు పౌరసేవల పర్యవేక్షణ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో పలు కీలక కూడళ్లలో ఆధునిక సాంకేతికతను జోడించిన సీసీ కెమెరాలను అమర్చనున్నారు. చెన్నైకు చెందిన అనలాగ్ అండ్ డిబిటల్ లాబ్స్ వారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు షురూ అయ్యాయి. ఈ మేరకు మంగళవారం నగరంలోని కొండారెడ్డి బురుజు, రాజ్ విహార్, బళ్లారి చౌరస్తా, హైవే, ఐటీసీ […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ పరిధిలో అనధికారికంగా, పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే కట్టడాలను కూల్చివేస్తామని కమిషనర్ డీకే బాలాజీ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఉల్చారోడ్డులో ఉన్న ఎన్టీఆర్ బిల్డింగ్స్ ప్రాంత కూడలిలో పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. వంద అడుగు రోడ్డులో ఆక్రమించి నిర్మించిన కట్టడాలను గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు యజమానుకు మొదటి నోటీసును పంపించారు. వారం రోజులు […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే కర్నూలు నగర పాలక పరిధిలో వ్యాపారాలు చేసుకోవాలని కమిషనర్ డీకే బాలాజీ సూచించారు. ఆదివారం ఆయన నగరంలోని కృష్ణానగర్, గణేష్ నగర్, ఎస్.నాగప్ప వీధి, నంద్యాల చెక్ పోస్టు ప్రాంతాల్లో కోవిడ్–19 నిబంధనలు పాటించని వారికి ఫైన్విధించారు. పాత బస్టాండ్ ఎస్.నాగప్ప వీధిలోని ఓ షాపు రెగ్జిన్ కవర్ ఏర్పాటు చేసుకోకపోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నందుకు సదురు దుకాణ యజమానికి రూ.500, అలాగే మాస్క్ […]
సారథి న్యూస్, ఎల్బీనగర్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ కమిషనర్ ఎల్.రవీందర్ రావు లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీసీపీ సూర్యానారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూరు గ్రామానికి చెందిన సురభి వెంకట్ రెడ్డి నూతనంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. నిర్మాణ అనుమతుల విషయంలో కమిషనర్ రవీందర్ రావు బాధితుడు వెంకట్ రెడ్డిని రూ1.5 లక్షలు డిమాండ్ చేయగా అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం […]