సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రూ.1.8 కోట్ల వ్యయంతో నిర్మించిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోమవారం ప్రారంభించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన భవనంలో వసతులు బాగున్నాయని కితాబిచ్చారు. సత్వర సేవలు అందించి జిల్లాలోనే నంబర్వన్ట్రెజరీగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 76 సబ్ ట్రెజరీ భవనాలకు ఒకేసారి నిర్మాణ అనుమతులు వస్తే నరసన్నపేటలో భవనం మొదటిసారిగా ప్రారంభానికి నోచుకోవడం గొప్ప విషయమని అన్నారు. అంతకుముందు ఆయన పూజలు చేశారు. […]
సారథి న్యూస్, ఎమ్మిగనూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జాతీయస్థాయిలో కరోనా కేసుల రికవరీ రేటు శాతం దాదాపు 69.29% ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10% తక్కువగా 60.8% నమోదవుతుందన్నారు. కరోనా క్వారంటైన్ […]