సారథి న్యూస్, హైదరాబాద్: సినీనేపథ్య గాయకుడు ఎస్పీ బాలసబ్రహ్మణ్యం మృతి పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీలోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ […]
గాన గాంధర్వుడు, ఆంధ్రుల ఆరాధ్యగాయకుడు, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) తుదిశ్వాస విడిచారు. కరోనాతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 10వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవలే ఆయన ఆరోగ్యం మెరుగపడిందని జనరల్‌వార్డుకు షిఫ్ట్అయ్యారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. అంతకుముందు ఆయనకు ఎక్మా సహా లైఫ్సపోర్ట్సాయంతో చికిత్స అందించారు. అయితే శుక్రవారం 1.04 నిమిషాలకు ఆరోగ్యపరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు […]
చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు కరోనా నెగిటివ్ వచ్చింది. కోవిడ్-19 లక్షణాలతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు.. దాదాపు నెల రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా చేసిన పరీక్షల్లో బాలుకు నెగిటివ్ గా తేలిందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. సోమవారం శుభవార్త చెప్తానని ఆయన రెండు రోజుల క్రితమే ఒక ట్వీట్ పెట్టారు. అన్నట్టుగానే చరణ్ స్పందిస్తూ.. ‘నాన్న ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. మరో వారం […]
కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సెలబ్రిటీలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సింగర్లు సునీత, మాళవిక కూడా కరోనా బారినపడ్డారు. అయితే తాజాగా మరో విషాధకరమైన విషయం ఏమిటంటే.. మాళవిక రెండేండ్ల కుమార్తెకు కరోనా సోకింది. దీంతో మాళవిక కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. మాళవిక తల్లిదండ్రులు కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వారంతా హోంఐసోలేషన్లో ఉండి చికిత్సపొందుతున్నారు. […]