సారథి న్యూస్, మెదక్: అత్యాచారం కేసును 60 రోజుల్లో విచారణ జరిపి బాధితులకు పరిహారంతో పాటు న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో 122, మెదక్ 25, సంగారెడ్డి 27 చొప్పున మొత్తం 174 కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. మెదక్ జిల్లాలో ఉన్న 25 పెండింగ్ కేసుల్లో ప్రధానంగా 12 కేసులు […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆయా వర్గాల్లో భరోసా నింపిందని చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ మీటింగ్లో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడువేల గ్రామాల్లో పర్యటించిందన్నారు. సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావు, జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరి, రాంబాబు నాయక్ పాల్గొన్నారు.