సారథి న్యూస్, దేవరకద్ర: కొత్తకోట మండలం కనిమెట్ట– జంగమాయపల్లి గ్రామాల బ్రిడ్జిని మంజూరుచేసి వెంటనే పనులు మొదలుపెట్టాలని మంత్రి హరీశ్‌రావును దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే దేవరకద్ర మండలం పేరూర్ లిఫ్టును మంజూరుచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరగా.. మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి […]
సారథి న్యూస్, దేవరకద్ర: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అందుకోసం సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తంచేశారని వెల్లడించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డితో కలసి శనివారం 7.7లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కోయిల్ సాగర్ తో పాటు కోయిలకొండ, రామగిరిగుట్ట, రాంకొండ ప్రాంతాలు పర్యాటక కేంద్రాల […]
సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల పంట పొలాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం సాగునీటిని విడుదల చేశారు. గత డిసెంబర్ 31న ప్రాజెక్టు కట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్దృష్టికి తీసుకెళ్లడంతో ఫండ్స్రిలీజ్ చేయించి యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. రైతులు ఇబ్బందిపడకుండా సాగునీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న చిరువ్యాపారులతో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు. సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ స్వయంగా నిమ్మకాయ సోడాను తయారుచేశారు. కరోనా సందర్భంగా తప్పకుండా మాస్క్ లు ధరించాలని, దూరాన్ని పాటించాలని సూచించారు. మాస్క్ లను పంపిణీ చేశారు.