Breaking News

ఎక్సైజ్

12లక్షల మద్యం పారబోసింన్రు

12లక్షల మద్యం పారబోసింన్రు

సామాజిక సారథి, తిమ్మాజీపేట: మండల కేంద్రంలో ఉన్న మద్యం గోదాంలో ఉన్న కాలం చెల్లిన మద్యాన్ని సోమవారం అధికారులు పార బోయించారు. దాదాపుగా 243లిక్కర్ కేసులు కాలం చెల్లింది. వీటిని మద్యం ప్రియులు సేవించకుండా పోయింది. దీనితో మద్యం డిపో మేనేజర్ లచ్చయ్య నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఎస్ఐ అనుదీప్ సమక్షంలో కాలం చెల్లిన మధ్యాన్ని హమాలీలతో పరబోయించారు. వీటి విలువ దాదాపుగా రూ.12లక్షల దాకా ఉంటుందని డిపో అధికారులు తెలిపారు.

Read More
నాటుసారా స్థావరాలపై దాడులు

నాటుసారా స్థావరాలపై దాడులు

సామాజిక సారథి‌, ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డులో  గురువారం సాయంత్రం నాటుసారా స్థావరాలపై జిల్లా ఎక్సైజ్ ట్రాస్క్ ఫోర్స్ సీఐ పోశెట్టి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో  సిబ్బంది రాజు, మధు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Read More