సారథి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెర్చ్ కమిటీలు, రాష్ట్రంలోని యూనివర్సిటీ లకు వీసీల నియామక ప్రక్రియను చేపట్టింది. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేశారు. శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వీసీల నియామకానికి ఆమోదం తెలిపారు.వీసీలు ఎవరంటే..ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్) వీసీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి కొత్త నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు విచారించింది. ఆస్పత్రి కూల్చివేతపై భిన్నవాదనలు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కూల్చివేయాలని ఓ వాదన.. పురాతన భవనమని మరో వాదన ఉందని వ్యాఖ్యానించింది. ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఈ ఆస్పత్రి మరమ్మతుల కోసం గతంలోనే రూ.6కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే, మరమ్మతుల పనుల పురోగతిని […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లోపలికి వర్షపు నీరు వచ్చిన నేపథ్యంలో గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అక్కడ బిల్డింగ్ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ ప్రాంగణంలో తిరిగి పర్యవేక్షించారు. మంత్రి హాస్పిటల్ వెలుపల పేషెంట్ వార్డులను పర్యవేక్షించారు వైద్యులతో పేషంట్ స్థితిగతులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య అధికారులు సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు మంత్రి వెంబడి […]
సారథి న్యూస్, హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పాత బిల్డింగ్‌లోకి వరద నీరు వచ్చిచేరింది. వార్డుల్లోకి వర్షపు నీరంతా చేరడంతో చికిత్స పొందుతున్న రోగులంతా తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, ఆపరేషన్చేయించుకున్న మహిళలు ఎక్కడికి వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు. అధికారులు, ఆస్పత్రి సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తోడివేయాల్సి వచ్చింది. ఈ ఘటన కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.