సారథి, రామడుగు: మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ రామడుగు మండల నాయకులు స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈటల త్వరగా కోలుకుని మళ్లీ హుజూరాబాద్ పాదయాత్ర పూర్తిచేయాలని ఆకాంక్షించారు. నాయకులు కట్ట రవీందర్, జేట్టవెని అంజిబాబు, మునిగంటి శ్రీనివాస్, డబులకార్ రాజు, నిరంజన్ ముదిరాజ్, జిట్టవేని రాజు, నీలం దేవకిషన్, ఉత్తేమ్ రాజమల్లు పాల్గొన్నారు.
సారథి, రామడుగు: మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా మంగళవారం స్థానిక ఆ పార్టీ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్య సెల్ మండలాధ్యక్షుడు బొజ్జ తిరుపతి స్వీట్లు పంచిపెట్టారు. ఈటల రాజేందర్ రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎడవెల్లి రామ్, మండల ఉపాధ్యక్షుడు ఎడవెల్లి లక్ష్మణ్, కట్ట రవీందర్, […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనాను ఎదుర్కొనేందుకు ఏకైక మందు ధైర్యమేనని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో హైదరాబాద్ పోలీసు ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కరోనా బాధితులకు మనోధైర్యం కల్పించేలా నడుచుకోవాలని కోరారు. ‘అమెరికా లాంటి దేశం కరోనాతో విలవిల్లాడుతుంటే మనం సమన్వయంతో ఎదుర్కొంటున్నాం. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయి. మనిషి మాత్రం ప్రకృతిని శాసించేందుకు ప్రయత్నిస్తున్నాడు. […]